LIVE : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీట్ ది ప్రెస్ - ప్రత్యక్షప్రసారం - MINISTER UTTAM PRESS MEET LIVE - MINISTER UTTAM PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 3:34 PM IST
|Updated : May 10, 2024, 3:54 PM IST
Minister Uttam Kumar Reddy Live Today : హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్లపై ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ఆరోపిస్తున్నారు. ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ సాగుచట్టాలను తెచ్చిందని మండిపడ్డారు. అధికార బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ ప్రభుత్వం ఆ హామీని విస్మరించిందని ధ్వజమెత్తారు. అగ్నివీర్ పథకం దేశ రక్షణకు ప్రమాదకరం అని విమర్శలు గుప్పిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ప్రజలకు ఏం చేసిందో మోదీ పార్టీ చేప్పడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పాలనతోనే మేలు జరుగుతుందని చెబుతున్నారు.
Last Updated : May 10, 2024, 3:54 PM IST