తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతల పవర్ పాయింట్ ప్రజంటేషన్ - Congress Leaders Live - CONGRESS LEADERS LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:19 PM IST

Updated : Apr 24, 2024, 8:27 PM IST

Congress Leaders Meeting Live : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించే విధంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా హైదరాాబాద్​ మంత్రులు ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. ఇందులో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతో కలిగిన నష్టాన్ని వివరిస్తున్నారు.
Last Updated : Apr 24, 2024, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details