రూ.2 కోట్లతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పునర్నిర్మాణం : మంత్రి ఉత్తమ్ - Uttam Inspect Sagar Left Canal - UTTAM INSPECT SAGAR LEFT CANAL
Published : Sep 15, 2024, 2:10 PM IST
Minister Uttam Kumar Reddy Inspect Nagarjuna Sagar Left Canal : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి రూ.2.10 కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆగస్టు నుంచి సెప్టెంబరు మొదటి వారంలో భారీ నుంచి భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రూ.10,300 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అన్నారు.
నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన రైతులకు ఇందిరమ్మ ఇల్లు ద్వారా నూతన ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తోందన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో తెగిపోయిన చెరువులు, కాల్వల పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.