తెలంగాణ

telangana

ETV Bharat / videos

'15లోపు సీతారామ ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేసి - సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు' - Tummala on Sitarama Project Start - TUMMALA ON SITARAMA PROJECT START

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 10:11 PM IST

Minister Tummala On Sitarama Project Works : సీతారామ ప్రాజెక్టు పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఇమామ్​నగర్ వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఎన్ఎస్​పీ అనుసంధాన కాలువ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని మళ్లించే విధంగా తక్కువ ఖర్చుతో కేవలం రూ. 70 కోట్లతో అనుసంధాన కాలువ నిర్మిస్తున్నామన్నారు.

ఈ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని, సాగర్ ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వనరుగా  తోడ్పడుతుందన్నారు. ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. కాగా భూసేకరణ, గుజరాత్ పైప్​లైన్ అనుమతులు, వర్షాల వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఆగస్టు 15 నాటికి మూడు పంప్ హౌస్​లు పూర్తి చేస్తున్నామని, హెడ్ వర్క్స్ పంప్ హౌస్ పూర్తయిందన్న మంత్రి, కమలాపురం,  పూసగూడెం పంప్ హౌస్​లు సైతం ట్రైల్ రన్ కంప్లీట్​ చేసినట్లు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details