తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నా : సీతక్క - Minister Seethakka On Murder Case - MINISTER SEETHAKKA ON MURDER CASE

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 7:23 PM IST

Minister Seethakka On Murder Case : నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని అంబేద్కర్ నగర్ కాలనీలో గత నెల హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రేమ పేరుతో శ్రీకాంత్ అనే యువకుడు గత నెలలో అలేఖ్యను అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఖానాపూర్‌ పర్యటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని మంత్రి కలిశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నామని మంత్రి సీతక్క అన్నారు. 

దోషికి కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి కేసు నమోదు చేయించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి వారికి శిక్షపడటం మూలంగా భవిష్యత్​లో ఇంకొక ఘటన జరగకుండా ఉంటాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవిధంగా అండగా ఉంటామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావులు ఉన్నారు.  

ABOUT THE AUTHOR

...view details