ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో రూ.7వేల కోట్లు బకాయి పెట్టింది: మంత్రి సత్యకుమార్​ - ap health minister - AP HEALTH MINISTER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 5:07 PM IST

Minister Satya Kumar Visit in Ananthapur Govt Hospital : రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన విధ్యంసాన్ని సరిదిద్దుతూ వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదలకు వైద్య సేవలతోపాటు, వైద్య విద్యార్థులకు బోధనలో నాణ్యత లోపించిందన్నారు. అనంతపురం ప్రభుత్వం ఆసుపత్రిలోని పలు విభాగాలను మంత్రి సత్యకుమార్​, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 48 శాతం బోధన సిబ్బంది కొరత ఉందన్నారు. కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. 

వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా రూ.7 వేల కోట్లు బకాయి పెట్టిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చెల్లించని బకాయిలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం వైద్య కళాశాలలకు వీజీఎఫ్ నిధులు ఇవ్వలేదని మంత్రి లెవనెత్తారు. వైద్య కళాశాలల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 300 కోట్ల నిధులు ఎక్కడున్నాయో వెతకాల్సి ఉందని ఆయన విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details