'అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం'- మంత్రిగా సంధ్యారాణి బాధ్యతలు - Minister Sandhya Rani Take Charge - MINISTER SANDHYA RANI TAKE CHARGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 7:46 PM IST
Minister Sandhya Rani Take Charge in Secretariat: ఐటీడీఏ, ఐసీడీఎస్లను ప్రక్షాళన చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సచివాలయంలో సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంరక్షణ కోసం ఏఎన్ఎంలను నియమిస్తూ మొదటి సంతకం చేశారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తన మీద ఎంతో నమ్మకంతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన స్కూళ్లలో డ్రాప్ అవుట్‌లను నివారిస్తామని మంత్రి పేర్కొన్నారు. తాగునీరు, సాగునీరు కల్పించటం తమ మొదట ప్రాధాన్యమని సంధ్యారాణి వెల్లడించారు. తనకు ఇచ్చిన శాఖలు ఎంతో కీలకమైనవి కావటంతో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని ఆమె స్పష్టం చేశారు. గతంలో టీడీపీ హయాంలో ఏఎన్ఎంలను నియమిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని తొలగించేసిందని మండిపడ్డారు. ఇక నుంచి పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదని పౌష్టికాహార లోపంతో ఏ తల్లి బాధపడకూడదని ఏఎన్ఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.