తెలంగాణ

telangana

ETV Bharat / videos

తూప్రాన్ బీసీ హాస్టల్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం - Minister Ponnam about BC Hostel

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 9:11 PM IST

Minister Ponnam Prabhakar visits Toopran BC Hostel : ప్రభుత్వ వసతి గృహాల్లో వసతులు మెరుగుపరుస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పురపాలికలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం వసతి గృహాన్ని సుమారు గంట సేపు పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలసి భోజనం చేశారు.

Minister Ponnam Prabhakar about Toopran BC Hostel : ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడటానికి వచ్చానని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details