LIVE : కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ - Ponnam Prabhakar Press Meet - PONNAM PRABHAKAR PRESS MEET
Published : Apr 23, 2024, 10:40 AM IST
|Updated : Apr 23, 2024, 11:04 AM IST
Minister Ponnam Prabhakar Press Meet Live : కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని దీనిపై ఇటీవల కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు కరీంనగర్లో పోటీ చేసేందుకు అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. తాజాగా దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారంలోకి వచ్చిన తాము చేసిన అభివృద్ధికి ఎవరిని బరిలో దింపినా గెలుస్తామని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్‌కు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి, తెలంగాణకు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏంటో చెప్పాలని నిలదీశారు. ప్రజలకు బీఆర్ఎస్, బీబేపీపై నమ్మకం లేకనే అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు.
Last Updated : Apr 23, 2024, 11:04 AM IST