ఆలస్యంగా వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి - అప్పటికే జారుకున్న మహిళలు - Minister Peddireddy tour
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 9:56 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Tour : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు (శుక్రవారం) పర్యటించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాలు ఉండేటట్లు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు మండలాల్లో పర్యటింటిన మంత్రి సాయంత్రం మడకశిరలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ నేతలు మహిళా సంఘాల సభ్యులను తరలించారు.
అయితే సాయంత్రం చీకటి పడుతున్నా మంత్రి సమావేశానికి రాకపోవడంతో మహిళలు విసుగెత్తిపోయారు. దీంతో సభ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం నుంచి మహిళలు ఒక్కొక్కరిగా వెనుదిరిగారు. మహిళలు బయటకు వెళ్లకుండా గేట్ల వద్ద సంఘాల యానిమేటర్లు అడ్డంగా నిలిచారు. అయినప్పటికి మహిళలు పెద్ద సంఖ్యలో వెనుదిరుగుతుంటే కళ్యాణ మండపం ప్రధాన ద్వారాన్ని సైతం మూసివేశారు. చివరికి సభ ప్రాంగణం వద్దకు మంత్రి చేరుకునే సరికి అక్కడి సభలో కొద్దిమందే మిగిలి ఉన్నారు. ఇక చేసేదేమీలేక అరకొర మందితోనే సభ కొనసాగించారు.