ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్- ​ ఫిర్యాదులన్నీ గత ప్రభుత్వ భూ బాధితులవే - Payyavula Conducted Praja Darbar - PAYYAVULA CONDUCTED PRAJA DARBAR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 3:54 PM IST

Minister Payyavula Keshav Conducted Praja Darbar In anantapur District : అనంతపురం ఆర్​అండ్​బీ అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా స్థాయి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలమూలల నుంచి తరలివచ్చిన బాధితులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారం చేయగలిగిన సమస్యలు వెంటనే పరిష్కారం చేసేలా అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ బాధితులంతా ఫిర్యాదులతో తరలి వస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి తమ నాయకుడు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పయ్యావుల  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరి ఫిర్యాదులు తీసుకొని రశీదు ఇచ్చి పంపే విధానం కాకుండా, సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా తాము ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రజాదర్బార్​కు (Praja Darbar) వస్తున్న బాధితులంతా ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలతోనే వస్తున్నారని ఆయన తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details