ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టుల విధ్వంసం- త్వరలో 'సోమశిల' పనులు ప్రారంభిస్తాం : నిమ్మల - Minister Nimmala Fires on YSRCP - MINISTER NIMMALA FIRES ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 10:25 AM IST

Minister Nimmala Fires on YSRCP : రివర్స్ టెండర్‌ పేరిట రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇరిగేషన్‌లో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో నెల్లూరు జిల్లాకు గత సర్కార్ తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని జలాశయాలను పరిశీలించిన ఆయన జలవనరుల సంఘం అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. 

Minister Nimmala On Irrigation :  సోమశిల ప్రాజెక్టు అప్రాన్ పనులు రెండు నెలల్లో మొదలు పెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి లస్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కండలేరు జలాశయంపై కూడా దృష్టి పెడతామని  చెప్పారు. దెబ్బతిన్న నీటి ప్రాజెక్టులను బాగుచేసి ప్రతి రైతుకూ నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 

మరోవైపు నెల్లూరును స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇరిగేషన్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని మంత్రి నారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details