ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 5:07 PM IST

ETV Bharat / videos

సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities

Minister Narayana Meeting with Municipal Commissioners: రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థల పరిస్థితిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈమేరకు సచివాలయంలో నగర పాలక కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ల నిధులు, ప్రస్తుత పరిస్థితిపై వారితో చర్చించారు. అలాగే నగరాల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డయేరియాను అదుపు చేయడం, తాగునీటి సరఫరాపైనా మాట్లాడారు. సమస్యల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, డ్రెయిన్​ల కోసం రూ. 5350 కోట్లు ఏఐబీ ద్వారా రుణం తెస్తే గత ప్రభుత్వం కేవలం రూ. 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని నారాయణ మండిపడ్డారు. ఈ నిధులు వినియోగించుకుని ఉంటే 123 మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రెయిన్​లు ఇతర మౌలిక సదుపాయాలు వచ్చేవని తెలిపారు. 

వర్షాకాలం కాబట్టి డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాదులు బయట పడుతున్నాయని దీనిపై ప్రత్యెక డ్రైవ్ చేపడుతున్నామని పేర్కొన్నారు. దీనికి రూ. 50 కోట్లు వ్యయం అవుతుందని, త్వరలోనే ఈ నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, నగరపాలక సంస్థల ఇంజినీర్లు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details