అందరికీ అందుబాటులో, ప్రజాక్షేత్రంలో మంత్రి లోకేశ్- కొనసాగుతున్న ప్రజాదర్బార్ - Minister Nara Lokesh Praja Darbar - MINISTER NARA LOKESH PRAJA DARBAR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 16, 2024, 1:41 PM IST
Minister Nara Lokesh Praja Darbar Program: ప్రజా సమస్యల పరిష్కారించే దిశగా మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన 'ప్రజాదర్బార్'ను రెండో రోజు కూడా నిర్వహించారు. సమస్యలు చెప్పుకొనేందుకు ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోకేశ్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలు విన్న లోకేశ్ తన సొంత నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఎంటీఎస్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరుతూ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ లోకేశ్‌కు వినతి పత్రం అందించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని తమ సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని బోధనేతర సిబ్బంది లోకేశ్‌కు విన్నవించారు. నూకలపేట ఉర్దూ పాఠశాలలో 9వ తరగతి బోధనకు అనుమతించాలని ఆ పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు కోరుతూ వినతి పత్రం అందించారు. ప్రజాసమస్యలపై వినతి పత్రాలు అందుకున్న లోకేశ్ స్పందిస్తూ వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.