ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏజెంట్​ చేతిలో మోసపోయి ఎడారిలో జీవిస్తున్న మరో వ్యక్తికి మంత్రి లోకేశ్​ భరోసా - Lokesh promise to telugu man - LOKESH PROMISE TO TELUGU MAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 12:21 PM IST

Minister Nara Lokesh Assured Another Telugu Man Who living in Saudi Arabia in Bad Condition : ఎడారి దేశం సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తానన్న నకిలీ ఏజెంట్‌ మాటలు నమ్మి మోసపోయానని వీరేంద్రకుమార్‌ అనే వ్యక్తి సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' లో వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఎడారిలో ఒంటెల మధ్య గడుపుతున్నానని, ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన నారా లోకేశ్‌ తిరిగి స్వస్థలానికి తీసుకొస్తానని యువకుడికి హామీ ఇచ్చారు.
 

ఇటీవలే కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్​లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్​​లో పోస్టు పెట్టిన వీడియోపై మంత్రి లోకేశ్​ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోవడంతో లోకేశ్​ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను ఏపీకి తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details