ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

క్రీడా సాధికార సంస్థపై మంత్రి మండిపల్లి సమీక్ష - వైఎస్సార్సీపీ అవినీతి, అక్రమాలపై ఆరా - Review on AP Sports Authority - REVIEW ON AP SPORTS AUTHORITY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 1:58 PM IST

Minister Mandipalli Review on AP Sports Authority: రాష్ట్ర క్రీడా సాధికార సంస్థపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ ఎండీ గిరీశా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం రవాణా, ఆర్టీసీతో పాటు క్రీడలపై సీఎం చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో కసరత్తులు చేస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో శాప్​లో అవినీతి, అక్రమాలపై మంత్రి ఆరా తీశారు. క్రీడా శాఖలో సమస్యలు సహా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల ప్రజెంటేషన్ ఇచ్చారు. 

కాగా సీఎం చంద్రబాబు సచివాలయంలో ఇవాళ సాయంత్రం వివిధ అంశాలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తదితర అంశాలపై చర్చించనున్నారు. సచివాలయంలో వైద్య-ఆరోగ్య, రవాణా, యువజన, క్రీడల శాఖలపై సమీక్షించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపైనా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details