ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నాయకుడు - ప్రతినాయకుడు - చంద్రబాబు, జగన్‌ తీరును పోల్చుతూ లోకేశ్ ట్వీట్‌ - Lokesh on Chandrababu and Jagan - LOKESH ON CHANDRABABU AND JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 10:11 PM IST

Minister Lokesh Tweet Comparing CM Chandrababu and YS Jagan: రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబును, హింసా రాజకీయాలను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ నాయకుడు - ప్రతినాయకుడు అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సీఎం తొలి దిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటనలను పోల్చి చూపుతూ జగన్​పై విమర్శలు చేశారు. నాయకుడు తొలి దిల్లీ పర్యటనగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారన్నారు. 

ప్రధానిని కలిసి రాష్ట్ర తక్షణ అవసరాలపై చంద్రబాబు విన్నవించారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులుపై చర్చించారని తెలిపారు. చంద్రబాబు మలి పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవనున్నారని లోకేశ్ తెలిపారు. ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటనలో అక్రమాలు, అరాచకాలు చేసి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్లారని మండిపడ్డారు. జగన్ మలి పర్యటనగా బాలికను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్టై కర్నూలు జైలులో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పరామర్శకూ వెళ్తాడా అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details