ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విత్త‌నాల‌ కోసం ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటాం : మంత్రి శ్రీనివాస్​ - Minister Srinivas Distribute Seeds - MINISTER SRINIVAS DISTRIBUTE SEEDS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 3:46 PM IST

Minister Kondapalli Srinivas Distribute The Seeds to Farmers: రాష్ట్రంలోని రైతులందరికీ వ్యవసాయ విత్తనాలు అందేలా చూస్తామని చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్‌ యార్డులో రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీని కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామానికి చెందిన‌ ప‌లువురు రైతుల‌కు 1121 రకం వ‌రి విత్త‌నాల‌ను అంద‌జేశారు. రైతులు విత్త‌నాల‌ కోసం ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఎరువులు, యూరియా వంటివి కూడా పంపిణీకి సిద్దంగా ఉంద‌ని అవ‌స‌ర‌మైన వారు వినియోగించుకోవాల‌ని సూచించారు. 

ప్ర‌తి రైతుకు మంచి జ‌ర‌గాల‌ని పండించిన పంట‌కు త‌గిన ఆదాయం రావాల‌ని మంత్రి శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. వ‌ర్షాలు పడుతుండటంతో వాతావ‌ర‌ణం వ్య‌వ‌సాయానికి అనుకూలంగా మారింద‌ని చెప్పారు. జిల్లా అవసరాలకు సరిపడా విత్తనాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. కౌలు రైతులకు సైతం సబ్సీడీ విత్తనాలను అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తాను మంత్రిగా రైతుల‌కు విత్తనాలు పంపిణీ చేసే తొలి కార్యక్రమం కావడంతో మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకొని వాటిని ప‌రిష్క‌రిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details