LIVE : హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి మీట్ ది ప్రెస్ - Minister Komati Reddy Live - MINISTER KOMATI REDDY LIVE
Published : May 8, 2024, 12:04 PM IST
|Updated : May 8, 2024, 1:57 PM IST
Minister Komati Reddy Meet The Press Program Live : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అభ్యర్థులందరూ ప్రజాక్షేత్రంలో ఓట్లభ్యర్థిస్తున్నారు. వారి తరఫున ప్రముఖ నాయకులందరూ ప్రచారం చేస్తూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. ప్రధాన పార్టీ నాయకులందరూ జనం మధ్య తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అగ్ర నాయకులు రాష్ట్ర పర్యటన చేసి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సమావేశాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు మంత్రులు తమ నియోజకవర్గంలోని నిలబడిన అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుబంధు, అకాల వర్షాల పంట పరిహారం ఇచ్చిందని తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో చేయబోయే విధానాలను వివరిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులపై పలు విమర్శలు చేస్తున్నారు.
Last Updated : May 8, 2024, 1:57 PM IST