ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫేక్ ప్రచారాలపై చర్యలు తప్పవు- జగన్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: మంత్రి కొలుసు - Kolusu ON YSRCP Fake Propaganda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 3:53 PM IST

Minister_Kolusu_Parthasarathy_on_YSRCP_Fake_Propaganda (ETV Bharat)

Minister Kolusu Parthasarathy on YSRCP Fake Propaganda: అబద్ధాలు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్​కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. ఆగస్టు 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛను అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు రాతలు తగవని హితవుపలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ చేతగాని తనంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. బిల్లులు చెల్లించకపోవటంతోనే నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపేశాయని గుర్తుచేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్​ది అని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో అంతులేని అక్రమాలు, భూ దందాలు తప్పా అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదని ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం మొత్తాన్ని వైఎస్సార్సీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details