ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాగునీటి సమస్యకు ప్రధాన కారణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే : మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Ravindra held Praja Darbar - KOLLU RAVINDRA HELD PRAJA DARBAR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 7:10 PM IST

Minister Kollu Ravindra held Praja Darbar in Machilipatnam : కృష్ణాజిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. మచిలీపట్నంలో తాగునీటి సమస్యకు ప్రధాన కారణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని చేతకానితనంతోనే తాగునీటి సమస్య వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రణాళిక తెలియక గత ప్రభుత్వం కృష్ణా డెల్టాను ఎడారి చేసిందని ధ్వజమెత్తారు. పట్టిసీమ ద్వారా వస్తున్న నీరు నేడు జిల్లా వాసులకు వరంగా మారిందన్నారు. మచిలీపట్నంలో త్వరలోనే 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

మాజీ మంత్రి పేర్ని నాని ఈ రోజుకి కూడా తన తప్పు తెలుసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలల్లో హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ శిశువు అపహరణ ఘటనపై మంత్రి స్పందించారు. హాస్పిటల్ లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ కెమెరాలతో నిరంతరం హాస్పిటల్ లో పర్యవేక్షణ చేస్తుండాలని ఆదేశించారు. హాస్పిటల్ లో పటిష్ట చర్యలు చేపడతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details