ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణాజిల్లాలో త్వరలో మైసూరు బృందావన్ గార్జెన్ తరహా ప్రాజెక్టు - Kollu Ravindra on Manginipudi Beach - KOLLU RAVINDRA ON MANGINIPUDI BEACH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 4:08 PM IST

Minister Kollu Ravindra on Manginipudi Beach: మచిలీపట్నంలోని మంగినిపూడి బీచ్ ప్రాంతాన్ని మైసూరు బృందావన్ గార్జెన్ తరహాలో తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పర్యాటక ప్రాంతాలు ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. సముద్ర తీర ప్రాంతం సుందరీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తీర ప్రాంతంలో ఉన్న వ్యర్థాలను సేకరించి స్వచ్ఛ సముద్ర తీర ప్రాంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి.. పర్యాటకులకు అవసరమైన మౌళిక సదుపాయాలు సమకూరుస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

"గత వైఎస్సార్సీపీ పాలనలో పర్యాటక ప్రాంతాలు వాటి ఉనికిని కోల్పోయాయి. వీటిపై ఆధారపడుతూ చాలా మంది జీవనం సాగిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు ఉనికిని కోల్పోవటంతో అలాంటివారు జీవనాధారం కోల్పోతున్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అవసరమైన మౌళిక సదుపాయాలు సమకూరుస్తాం. ఈ క్రమంలో మచిలీపట్నంలోని మంగినిపూడి బీచ్ ప్రాంతాన్ని బృందావన్ గార్జెన్ గా తీర్చిదిద్దుతాం." - కొల్లు రవీంద్ర, గనుల శాఖ మంత్రి 

ABOUT THE AUTHOR

...view details