ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మదనపల్లె ఫైల్స్ దహనం కుట్ర వెనక ఎవరున్నా వదలం: మంత్రి అనగాని - Minister Anagani Interview - MINISTER ANAGANI INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:05 AM IST

Minister Anagani Interview on Madanapalle Files Burning Case: మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కుట్రకోణం దాగి ఉందని, దాని వెనక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా వ్యవహరించారన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో జరిగిన భూ అక్రమాలపైన కూడా దృష్టి పెడుతున్నామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో ఈటీవీ ముఖాముఖి.

"మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కుట్రకోణం ఉంది. ఈ ఘటన వెనక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టం. ప్రతి రెవెన్యూ కార్యాలయం వద్ద పటిష్ట చర్యలు చేపట్టాం. ఇతర ప్రాంతాల్లో భూ అక్రమాలపైనా దృష్టి పెడుతున్నాం. వైఎస్సార్సీపీ పాలనలో లెక్కలేనన్ని భూ దోపిడీలు జరిగాయి." - అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details