LIVE : మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు - mega star chiranjeevi live - MEGA STAR CHIRANJEEVI LIVE
Published : Sep 22, 2024, 5:42 PM IST
|Updated : Sep 22, 2024, 6:06 PM IST
Mega Star Chiranjeevi got Guinness World Record Live : మెగాస్టార్ అంటే రికార్డుల పంటే. పద్మవిభూషణ్ నుంచి నేటి గిన్నిస్ బుక్ రికార్డు వరకు వరుస పరంపరనే. విభిన్న ఆహార్యం, సినిమాల్లో నటనకుగానూ గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కింది. నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. తెలుగు సినీరంగంలో అత్యధికంగా నృత్యరీతులు ప్రదర్శించినందుకు గానూ ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ హైదరాబాద్‌లో చిరంజీవికి అవార్డును అందజేశారు. 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటలకు డ్యాన్స్ చేశారు. మొత్తం 24వేల స్టెప్పులేశారు. ఈ కార్యక్రమంలో సాయిదుర్గ తేజ్, వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో చిత్రాల్లో తన నటనతో చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది.
Last Updated : Sep 22, 2024, 6:06 PM IST