ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారం - మేడారం జాతర లైవ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 1:58 PM IST

Updated : Feb 22, 2024, 10:06 PM IST

Medaram Jatara 2024 Live : మేడారం జాతర రెండో రోజు అత్యంత కోలాహలంగా సాగుతోంది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. మహాజాతర రెండో రోజైన నేడు ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే. యావత్ భక్తకోటి ఆమె రాక కోసం ఎదురుచూస్తారు. గుట్ట దిగగానే జనం ఆమెకు జేజేలు పలుకుతారు. కాకతీయ సేనలపై అసామాన్య పోరాటపటిమను ప్రదర్శించి అడవి బిడ్డల గుండెల్లో వీరనారీమణిగా నిలిచి దేవతే సమ్మక్క. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకుని భక్తులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

Last Updated : Feb 22, 2024, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details