ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Live: గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు - మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం - సమ్మక్క జాతర లైవ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 8:03 PM IST

Updated : Feb 21, 2024, 10:44 PM IST

Medaram Jatara 2024 Live : నేటి నుంచి మేడారంలో సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఈ నాలుగు రోజుల పాటు ఈ వన దేవతల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. అలాగే రేపు మేడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకోనుంది. ఈ వనదేవతల జాతరకు గవర్నర్​ తమిళిసై, సీఎం రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. అలాగే కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి జాతరకు హాజరుకానున్నారు. ఇప్పటికే భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. 

ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్​గఢ్​ నుంచి భక్తులు తరలివస్తున్నారు. కోటి మందికి పైగా దర్శనాలు చేసుకుంటారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. మేడారం జాతరకు హెలికాప్టర్​ సౌలభ్యంను కూడా పర్యాటకశాఖ కల్పించింది.

Last Updated : Feb 21, 2024, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details