ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ నుంచి మెుదలైన వలసలు - కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్ - Nara lokesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 5:47 PM IST

Massive joined from YSRCP to TDP: తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలోకి మంగళగిరి నుంచి పెద్దఎత్తున పార్టీలోచేరారు. పసుపు కండువా కప్పి లోకేశ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చిన వారిని ఇప్పటికే పనిచేస్తున్న నేతలు కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు టీడీపీలో చేరారు. మంగళగిరి అభివృద్ధి కోసం తమ వెంట వస్తున్న నేతలకు లోకేశ్ అభినందనలు తెలిపారు. తాడేపల్లి పట్టణానికి చెందిన పల్లెపోగు అరుణ్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, చింకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, 11వ వార్డుకు చెందిన 30 కుటుంబాలు, మంగళగరి పట్టణానికి చెందిన అవ్వారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, చిర్రావూరుకు చెందిన రెడ్డి విజయ్, మేడూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు పసుపుకండువా కప్పికుని పార్టీలో చేరాయి. 

గత కొంత కాలంగా మంగళగిరి నియోజకవర్గంపై దృష్టిపెట్టిన లోకేశ్ నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారంలో లేకపోయినా నియోజకవర్గ ప్రజల కష్టాలపై స్పందిస్తూ వస్తున్నారు. అధికారంలో లేకపోయినా తమ కోసం పాటుపడుతున్న లోకేశ్ వైపు మంగళగిరి ప్రజలు చూస్తున్నారు. అందు కోసమే త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు మెుదలయ్యాయి.   

ABOUT THE AUTHOR

...view details