ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మహాశివరాత్రి పర్వదినం - బెజవాడ దుర్గమ్మకు మార్కండేయ వంశస్థుల సారె - Bejawada Durgamma Handloom Saree

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 7:52 PM IST

Markandeya Trust Presents Silk Clothes to Bejawada Durgamma: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరికి చెందిన శివభక్త మార్కండేయ వంశస్థులు (Markandeya Descendants) సారె సమర్పించారు. భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో తయారు చేసిన వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు చిరంజీవి, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అమ్మవార్లకు చేనేత కళ్యాణ వస్త్రాలను నివేదనగా అందించారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి చేనేత శ్వేత పట్టు వస్త్రాలు సమర్పించారు.

Silk Clothes Presents to Durgamma: భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు చేనేత మగ్గాలపై భక్తిశ్రద్ధలతో తయారు చేసిన వస్త్రాలను ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామరావు తదితరులు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. 

ABOUT THE AUTHOR

...view details