కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది : మందకృష్ణ మాదిగ - Manda Krishna Madiga Demands - MANDA KRISHNA MADIGA DEMANDS
Published : Apr 13, 2024, 3:09 PM IST
Manda Krishna Madiga Fire on Kadiyam Srihari : కడియం శ్రీహరికి రాజకీయ విలువలుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నీతి నిజాయతీతో కూడిన రాజకీయాల గురించి పార్టీ ఫిరాయించిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Manda Krishna Madiga Comments : కడియంకు దమ్ముంటే ఈటల రాజేందర్‌ను, రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మందకృష్ణ మాదిగ సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి లేరని విమర్శించారు. తాను వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాలు చేయట్లేదని స్పష్టం చేశారు. శ్రీహరి 40 ఏళ్ల నుంచి నీచ రాజకీయాలు చేశారని వ్యాఖ్యానించారు. వరంగల్ స్థానంలో మాదిగలకు టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు చేస్తోందని మండిపడ్డారు.