మిగిలిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి నిరసన - DSC Notification in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 12:35 PM IST
Man Climbed Cell Tower and Protested: డీఎస్సీ 1998లో అర్హత సాధించిన వారికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా పట్టుకొని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థి భైరవకోన శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మంగళగిరిలో పురుగుల డబ్బా చేత పట్టుకొని జాతీయ రహదారి పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కారు.
వైసీపీ జెండా వేసుకొని సీఎం ఫ్లెక్సీతో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వం డీఎస్సీ 1998లో మిగిలిన 1840 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే ఉద్యోగంలోకి 4000 మందికి పైగా తీసుకోగా వారిలో దాదాపు 2000 మంది ఉద్యోగ విరమణ పొందారని, వారి స్థానంలో మిగిలిన అభ్యర్థులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో హెచ్చరించారు.