తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎంపీగా పోటీ చేయడానికి అర్హత లేదని ఒక్క కారణం చూపినా బరిలోంచి తప్పుకుంటా : మల్లు రవి - Mallu Ravi Resignation

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 1:21 PM IST

Mallu Ravi Interview : నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అర్హత లేదని ఒక్క కారణం చూపినా ఎంపీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని మాజీ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. పార్లమెంటు టికెట్‌ రావడానికి అన్ని అర్హతలు తనకు ఉన్నాయని వెల్లడించారు. ఒక పదవి ఉండగా, మరో పదవి కోసం పోటీ చేయడంపై వస్తున్న విమర్శలతోనే తాను దిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి నాగర్‌ కర్నూలు లోక్​సభ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకే దిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా చేరారని, నాగర్​కర్నూల్​లో కార్యకర్తల కోరిక మేరకు ఇప్పుడు రాజీనామా చేసినట్లు తెలిపారు. 

Mallu Ravi Reaction on Resignation : గత పది సంవత్సరాలుగా నాగర్​కర్నూల్​ జిల్లాలో కాంగ్రెస్​ కార్యకలాపాలను చూసుకుంటున్నట్లు మల్లు రవి వెల్లడించారు. తాను లోక్​సభ ఎంపీగా పోటీ చేస్తే గెలుపొందిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో పోరాడతానని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీలో విధేయుడిగా పని చేస్తున్నందున టికెట్‌ వస్తుందన్న విశ్వాసం వంద శాతం ఉందంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లురవితో ఈటీవీ భారత్​ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details