వేధింపులు తట్టుకోలేక పెట్టుబడిదారులు పరార్ - అడవిలా మల్లవల్లి పారిశ్రామికవాడ - Mallavalli Industrial Park - MALLAVALLI INDUSTRIAL PARK
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 4:42 PM IST
Mallavalli Industrial Park in Krishna District : వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నీలినీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం అన్ని వసతులతో మెగా ఫుడ్ పార్క్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత మల్లవల్లి పరిశ్రమను అటకెక్కించింది. అశోక్ లే ల్యాండ్ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా ప్రారంభించలేదు. మధ్యలోనే పార్లే ఆగ్రో పరిశ్రమ పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక పెట్టుబడులు పెట్టలేమంటూ పారిశ్రామికవేత్తలు పారిపోయారు. కంపెనీల కోసం కేటాయించిన స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి చిట్టాడవిని తలపిస్తున్నాయి.
ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వేలాది మంది ముందుకు వచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల పెట్టుబడుదారులు రాష్ట్రం నుంచి తరలివెళ్తున్నారు అని చెప్పడానికి మల్లవల్లి పారిశ్రామికవాడను చూస్తే అర్థం అవుతుంది. అధికార ప్రభుత్వం హయాంలో ప్రారంభానికి నోచుకోలేక శిథిలావస్థకు చేరుతున్నాయని చెప్పడానికి మల్లవల్లి పారిశ్రామికవాడే నిదర్శనం.