ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆ సమావేశానికి నన్ను పిలవలేదు: ఎమ్మెల్యే తిప్పేస్వామి - ap political news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 8:15 AM IST

Madakasira MLa Thippeswamy Comments on Peddireddy Ramachandra Reddy : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ వ్యాప్తంగా నిర్వహించిన ఎమ్మెల్యేల, సమన్వయకర్తల సమావేశానికి తనను పిలవలేదని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జ్​ లక్కప్ప వర్గీయులు చేసిన విమర్శలపై తిప్పేస్వామి మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ లక్కప్పను ఇన్​ఛార్జ్​గా నియమించడంతో ఇప్పుడు పార్టీ గుర్తుకు వచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దళిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను ఉద్దేశపూర్వకంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి దూరం చేశారంటూ నియోజకవర్గ పరిశీలకుడు అశోక్ కుమార్​ను  తిప్పేస్వామి ప్రశ్నించారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో తిరుపతిలో సమావేశం నిర్వహించారని, తనని పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అది పార్టీ అంతర్గత మేమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనపై ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నిన చివరి క్షణం వరకు పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నిస్తానని, స్థానికంగా ఉంటూ పార్టీలోనే కొనసాగుతానంటూ ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details