ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విద్యుత్ తీగలు తగిలి లారీకి వ్యాపించిన మంటలు - డ్రైవర్ మృతి - లారీ మంటల్లో ఒకరు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 7:43 AM IST

Lorry Driver Dead Fire Due to Electric Wires at Velvadam: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో విద్యుత్తు తీగలు లారీ ట్రక్కుకు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొండపల్లి ప్రాంతం నుంచి టిప్పర్లతో కంకర తరలిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మండలంలోని కొత్తగూడెెంకు చెందిన డ్రైవర్ సాయిరి నర్సయ్య టిప్పరులో తెచ్చిన కంకరను స్థానిక సత్రం వద్ద అన్​లోడ్​ చేస్తున్నాడు. హైడ్రాలిక్ ద్వారా ట్రక్కును ఎత్తగా పైనున్న విద్యుత్తు తీగలు తగలడంతో షాక్​కు గురయ్యాడు. ఈ క్రమంలో ప్రాణాలు నిలుపుకొనేందుకు అతడు కిందకి దూకగా ఇంజిన్​కు కూడా విద్యుత్ సరఫరా కావడంతో మంటలు వ్యాపించాయి. అపస్మారక స్థితిలో ఉన్న నర్సయ్యను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details