రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ అజెండా : లోకేశ్ - Lokesh Election Campaign - LOKESH ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 2:01 PM IST
Lokesh Election Campaign in Sri Chakra Apartment Guntur District : స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల, మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి అజెండా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీ చక్ర అపార్ట్ మెంట్ వాసులతో లోకేశ్ సమావేశమయ్యారు. జగన్ వినాశకర చర్యల ఫలితంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకపోగా ఇక్కడి పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు.
Mangalagiri Constituency : అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతో ఉద్యోగాల కోసం యువత తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయడం చేతగాని జగన్ రాష్ట్రాన్ని మాత్రం గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు.