LIVE : లోక్‌సభలో బడ్జెట్‌పై వాడివేడి చర్చ - LOK SABHA LIVE TODAY
Published : Jul 25, 2024, 11:01 AM IST
|Updated : Jul 25, 2024, 1:25 PM IST
Lok Sabha Live : వికసిత్‌భారత్ లక్ష్య సాధన దిశగా మోదీ 3.O సర్కార్‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మూడోవిడత ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో నవ సూత్రావళిని ఆవిష్కరించింది. అన్ని రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి కల్పనే వీటి లక్ష్యమని ఉద్ఘాటించింది. తొమ్మిది ప్రాధాన్యాంశాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా అన్నివర్గాల ప్రజలకు విస్త్రత అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 48.21లక్షల కోట్ల రూపాయల అంచనాలతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. వ్యవసాయానికి మరోసారి అగ్రతాంబూలం ఇచ్చిన మోదీ సర్కార్ దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రోజున లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. విపక్ష రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్ష చూపించిందంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. రాజ్యసభలో విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించారు. నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటంతోపాటు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి బడ్జెట్‌పై లోక్‌సభలో వాడివేడి చర్చ జరుగుతోంది.
Last Updated : Jul 25, 2024, 1:25 PM IST