ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ నేతకు చెందిన షెడ్డులో మద్యం డంప్- స్వాధీనం చేసుకున్న పోలీసులు - Liquor seized at YSRCP Leader Shed - LIQUOR SEIZED AT YSRCP LEADER SHED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 4:53 PM IST

Liquor seized at YSRCP Leader Shed: రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికల హడావుడి పెరుగుతుంటే మరోవైపు మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల వేళ ఎక్కడికక్కడ భారీగా మద్యం పట్టుబడుతోంది. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ నాయకులు నిల్వ చేసి ఉంచిన మద్యం భారీ ఎత్తున పట్టుబడుతోంది. 

తాజాగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ నేతకు చెందిన షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐ. పోలవరం మండలంలోని పశువుల్లంక గ్రామ సమీపంలో చేపల చెరువుల వద్ద దాచి ఉంచిన 63 కేసుల మద్యంను ఎన్నికల విభాగం స్పెషల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెరువుల వద్ద కాపలా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని స్టేషన్‌కు తరలించిన పోలీసులు చెరువు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details