ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దెబ్బతిన్న లింగాల వంతెన - కొట్టుకుపోయిన కాంక్రీట్‌ స్లాబులు - Lingala Bridge Damaged

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 1:31 PM IST

Lingala Bridge Damaged on Floods in Jaggaiyapet : మునేరు వరద ఉద్ధృతికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద లింగాల వంతెన కొట్టుకుపోయింది. కిలోమీటర్ మేర ఉన్న వంతెనపై పలుచోట్ల భారీ గండ్లు ఏర్పడ్డాయి. వరద నీటిలో కాంక్రీట్ స్లాబులూ కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. వరద తాకిడికి రెండుచోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. మరమ్మతులకూ పనికిరాదని స్థానికులు అంటున్నారు. జగ్గయ్యపేట నుంచి ఖమ్మం ప్రాంతానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి లింగాల వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.

గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఎన్నడూ లేని విధంగా మునేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో నందిగామ మండలం ఐతవరం వద్ద విజయవాడ హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మునేరుకు భారీగా వరద చేరుతుంది. లోతట్టు ప్రాంతావాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details