రైల్వేస్టేషన్లో ఆగిపోయిన లిఫ్ట్- ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి - రైల్వే స్టేషన్లో విద్యుత్ కోతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 1:24 PM IST
Lift Stopped in Railway Station Passengers Problems in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన లిఫ్టు కరెంటు కోత వల్ల సుమారు 30 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో లిఫ్ట్లో ఉన్న చిన్నారులు, ప్రయాణికులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణికులు బయటకు వచ్చేందుకు లిఫ్టు ఎక్కగా లిఫ్టు మధ్యలోనే నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు బాధితులు తెలిపారు.
escalator Stopped Due To Power Cut : లిఫ్ట్లో గాలి ఆడక చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. అరగంట తర్వాత విద్యుత్ వచ్చేయడంతో లిఫ్ట్ పని చేసి బయటకు వచ్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు పట్టించుకోవట్లేదని రైల్వే ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.