తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం - ISRO TO LAUNCH GSLV F15 LIVE

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 6:24 AM IST

Updated : Jan 29, 2025, 11:36 AM IST

ISRO to launch GSLV-F15 Live  : ఇవాళ శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం చేసింది. చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నేడు షార్‌ నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ ప్రయోగం చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ నేతృత్వంలో ఇది తొలి మిషన్. నిన్న అర్ధరాత్రి 2.53 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ కొనసాగింది. జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ 50.9 మీటర్లు పొడువు, 2,250 కిలోల బరువు ఉంటుంది. నావిక్‌లో భాగమైన ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-02 రెండోది. ఇస్రో ఎన్‌ఎస్‌వీ-01 ఉపగ్రహాన్ని 2023 మే 29న ప్రయోగించిన ఇస్రో . ఎన్‌ఎస్‌వీ-02 ఉపగ్రహాన్ని డిజైన్ చేసిన యూఆర్‌ శాటిలైట్ సెంటర్. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఉపగ్రహ ప్రయోగం. వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణ కోసం ప్రయోగం చేస్తున్నారు. మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవల కోసం ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుంది. 1979లో షార్‌ నుంచి చేపట్టిన మొదటి ప్రయోగమైన రోహిణి విఫలమయ్యింది. ఇప్పటి వరకు షార్ నుంచి ఇస్రో జరిపిన99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి.
Last Updated : Jan 29, 2025, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details