LIVE : మల్కాజిగిరిలో కేటీఆర్ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ - KTR Meeting Live - KTR MEETING LIVE
Published : Apr 29, 2024, 8:05 PM IST
|Updated : Apr 29, 2024, 8:27 PM IST
KTR Meeting with social Media Warriors Live : లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నేరుగా జనాల్లోకి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వాడీవేడీ ఉపన్యాసాలతో ఒక్కసారిగా సమ్మర్ హీట్ కంటే రాజకీయ హీట్‌ను పెంచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణుల్లో నూతనుత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసారి తెలంగాణ గొంతుకై బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వేడుకున్నారు.
Last Updated : Apr 29, 2024, 8:27 PM IST