LIVE : కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో కేటీఆర్ - KTR Karimnagar MP Meeting Live
Published : Mar 7, 2024, 1:37 PM IST
|Updated : Mar 7, 2024, 2:37 PM IST
KTR Live : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని కేటీఆర్ తెలిపారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, ఇక్కడ హామీలు అమలయ్యేది లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రియమైనవారు కాదని పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆక్షేపించారు. తాజాగా కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Last Updated : Mar 7, 2024, 2:37 PM IST