తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మీడియా సమావేశం - KTR on Congress About Job Calendar - KTR ON CONGRESS ABOUT JOB CALENDAR

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 8:39 PM IST

Updated : Aug 2, 2024, 8:47 PM IST

KTR Fires on Congress About Job Calendar : గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేస్తున్న కేటీఆర్, హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ సర్కార్​ జాబ్‌ క్యాలెండర్‌తో యువతను మభ్య పెడుతోందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ శాసనసభ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ వద్ద బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, జాబ్‌ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదన్నారు. రెండు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్‌ అంటున్నారని విమర్శించారు. దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారముందని అసెంబ్లీలో మా గొంతు నొక్కితే, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వెల్లడించారు.
Last Updated : Aug 2, 2024, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details