ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణా పశ్చిమ కాలువకు గండి- పొలాలను ముంచెత్తిన వరద - Crop Fields Submerged in Water

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 11:25 AM IST

Krishna West Canal Gandi (ETV Bharat)

Krishna West Canal Gandi Crop Fields Were Submerged : కృష్ణా పశ్చిమ కాలువకు బాపట్ల జిల్లా పరిధిలో గండి పడింది. కొల్లూరు మండలం దోనెపూడి సమీపంలో గండి పడటంతో కాలువ నుంచి సాగు నీరు పొలాలను ముంచెత్తింది. పంట పొలాల్లోకి నీరు ఎక్కువగా రావటం చూసి స్థానిక రైతులు అప్రమత్తమయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు జేసీబీతో మట్టి వేసి గండి పూడ్చారు. సాగునీరు వృథా కాకుండా అడ్డుకట్ట వేయగలిగారు. 

ఈ కాలువ దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు నుంచి మొదలై తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో 1.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ కాలువ నీటి విడుదల పూర్తి సామర్థ్యం 2200 క్యూసెక్కులు, అయితే దిగువ భూములకు సాగునీరు అందడం లేదని రైతులు చెప్పడంతో నీటిపారుదల శాఖ అధికారులు కాలువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. కాలువకు గండి పడటాన్ని సకాలంలో గుర్తించకపోతే భారీగా నీరు వృథా పోయేది.

ABOUT THE AUTHOR

...view details