జిల్లా వ్యాప్తంగా 1900 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు - ఎస్పీ నయీం అస్మీ - SP Interview With Counting Purpose - SP INTERVIEW WITH COUNTING PURPOSE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 7:30 AM IST
Krishna District SP Adnan Nayeem Asmi Interview: కృష్ణా జిల్లాలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుకు 1900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. జిల్లాలో పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఆయా నియోజకవర్గాల్లో బందోబస్తును పెంచామన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలతో నిఘాను ఏర్పాటు చేశామని వివరించారు.
Election Counting Purpose: కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల ఫలితాల ఆనంతరం టపాసులు కాల్చడం, డీజేలు పెట్టి ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్ నయీం అన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి వ్యహరించాలని ఆయన సూచించారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.