నో హెల్మెట్ నో ఎంట్రీ- కలెక్టరేట్లోకి రావాలంటే తప్పనిసరి: కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ - Helmet Awareness Programme - HELMET AWARENESS PROGRAMME
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 10:44 AM IST
Krishna District Collector Conducted Helmet Awareness Programme at Collectorate Main Gate : హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులను మాత్రమే కలెక్టరేట్ లో అనుమతిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ వినియోగం ఆవశ్యకతను తెలియజేస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ లోకి వస్తున్న ఉద్యోగులను కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్దే ఆపి హెల్మెట్ వినియోగం ఆవశ్యకతను వివరించారు.హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో అధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భారంగా కాకుండా బాధ్యతగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.
హెల్మెట్ వినియోగం ఆవశ్యకతను వివరిస్తూ నిర్వహించిన అవగాహనా కార్యక్రమం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు హెల్మట్ ధరించాలని సూచించారు. హెల్మెన్ లేని వాహనదారుల బండిని లోపలికి అనుమతించమని, వారు హెల్మెట్ కొనుకున్న తరువాతే వారి వాహనాన్ని వారికి అప్పజెప్తామన్నారు. ఈ క్రమంలో వాహనదారుల నుంచి ఎటువంటి పెనాల్టీ విధించనమని కేవలం వారు హెల్మెట్ తీసుకోవడమే మా లక్ష్యమని తెలిపారు.