కొన్ని ఉద్యోగ సంఘాలు స్దాయిని తగ్గించుకున్నాయి - జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని దుస్ధితి: సూర్యనారాయణ - KR Suryanarayana Comments - KR SURYANARAYANA COMMENTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 10:15 PM IST
KR Suryanarayana Comments on Employees Problems: ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యోగ సంఘాలు తమ స్దాయిని తగ్గించుకున్నాయని, జీతాలు, పింఛన్లు ఒకటో తేదీన వస్తాయో రావో తెలియని దుస్ధితిని చూశామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక ఫింఛనుదారుల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్ధిక, సర్వీస్, సంక్షేమ అంశాలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయని, హక్కుగా ఉన్న ఆర్ధిక ప్రయోజనాలను అడుగుతూ గవర్నర్ను కూడా కలిశామని వివరించారు.
విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి 500 కోట్లు డెబిట్ చేయడం నేరమని, 12వ వేతన సవరణలో పెరగాల్సిన జీతం పెంచలేదన్నారు. ఐదేళ్లుగా డీఏ చెల్లింపులు లేవన్న ఆయన, బకాయిలు రావాలంటే రిటైర్మెంట్ అయినా కావాలి లేదా కాలం చేయాలనే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 25 వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయని వాటిపైనే తమకు ఆందోళన నెలకొందన్నారు.