డోన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి కష్టాలు- బుగ్గన ఏంచేశారో చెప్పాలి?: సూర్యప్రకాశ్‌రెడ్డి - Kotla Suryaprakash on Buggana - KOTLA SURYAPRAKASH ON BUGGANA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 7:15 PM IST
Kotla Suryaprakash Reddy Allegations on Buggana: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) ఎక్కడ చేశారో చూపించాలని డోన్ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏ గ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉందని, ప్రజలు ఐదేళ్లుగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. 77 చెరువులను నింపుతామని గొప్పలు చెప్పారని ఏ చెరువు నింపారో చెప్పాలన్నారు. బుగ్గన కనీసం నామినేషన్ పత్రాన్ని సైతం పూర్తిగా నింపలేకపోయారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామని, కూటమి మేనిఫెస్టో చాలా బాగుందని ప్రజలు స్వాగతిస్తున్నారని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (Dhone Alliance Candidate Kotla Suryaprakash Reddy) తెలిపారు. సూపర్-6 పథకాలు, కూటమి మేనిఫెస్టోకు (Alliance Manifesto) ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామంటుని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు.