ఖాతాదారురాలి సొమ్ము కొట్టేసిన పోస్ట్మాస్టర్ - బాధితురాలి ఆవేదన - Postmaster Fraud in Satya Sai Dist - POSTMASTER FRAUD IN SATYA SAI DIST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 12:14 PM IST
Postmaster Fraud in Satya Sai District : కంచే చేను మేసిన రీతిలో పోస్ట్మాస్టర్ ఖాతాదారుల సొమ్ము దోచుకున్న ఉదంతం శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్లలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తపాలా కార్యాలయంలో ఖాతాదారుల సొమ్మును రుణం పేరిట పోస్ట్మాస్టర్ స్వాహా చేసినట్లు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీరప్పగారిపల్లికి చెందిన చెన్నమ్మ అనే మహిళ ప్రతీ నెలా రూ. 500 తపాలా కార్యాలయంలో పొదుపు చేస్తుంది. ఈ క్రమంలో పోస్ట్మాస్టర్ ఆమె వేలిముద్ర వేయించుకుని కూడగట్టుకున్న సొమ్మును రుణం పేరిట స్వాహా చేశాడు.
రుణానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆమెకు ఫోన్ రావడంతో విషయం తెలిసి ఆమె కంగుతింది. చెన్నమ్మ హుటాహుటిన తపాలా కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా పోస్ట్మాస్టర్ డొంక తిరుగుడు సమాధానం చెప్పినట్లు ఆమె ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తోంది. కాయాకష్టం చేసి నెలనెలా పొదుపు చేస్తే నాకు అన్యాయం చేశారని వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతుంది.