కృష్ణా జలాల సరఫరా పునరుద్ధరణ కోసం 'నీటి సత్యగ్రహ యాత్ర' - కొలికపూడి శ్రీనివాసరావు పాదయాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 7:22 PM IST
Kolikapudi Srinivasa Rao Pada Yatra For Krishna River Water : కృష్ణా జలాల సరఫరా పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు 'నీటి సత్యగ్రహయాత్ర' పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరు మండలంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో నిలిచిన జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎ. కొండూరు మండలం అడ్డరోడ్డు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు గిరిజనులు ఖాళీ బిందెలతో పాదయాత్ర కొనసాగించారు.
Tribal People Demand for Water : వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజనులకు కృష్ణా జలాలు అందించలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొలికపూడి డిమాండ్ చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు వెంట టీడీపీ - జనసేన నేతలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పాదయాత్రలో గిరిజనులతో పాటు పలు పార్టీనేతలు భారీగా పాల్గొనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.